Take a fresh look at your lifestyle.

పవిత్రమైనటువంటి వృత్తి న్యాయవాద వృత్తి

  • ఘనంగా సిద్దిపేట బార్ అసోసియేషన్ లో అంతర్జాతీయ న్యాయవాద దినోత్సవ వేడుకలు.
  • సిద్దిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులకు సన్మానం.
  • శుభాకాంక్షలు తెలిసిన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి బాబాయ్ మాత.

ముద్ర విలేకరి, సిద్దిపేట:  నేడు అంతర్జాతీయ న్యాయవాద దినోత్సవం పురస్కరించుకొని సిద్దిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు చింతలపల్లి జనార్దన్ రెడ్డినీ, సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో న్యాయవాది వర్కోలు రాజలింగం ను లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బాబాయ్ మాతా సన్మానించారు.అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు చింతలపల్లి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో అత్యంత పవిత్రమైనటువంటి వృత్తి న్యాయవాద వృత్తి ఈ వృత్తిలో ఎంతోమంది న్యాయవాదులు ప్రజాసేవ చేసుకుంటూ ప్రజలకు అండదండగా నిలుస్తున్నారన్నారు.. న్యాయవాద మిత్రులను ఉద్దేశించి మాట్లాడారు. అలాగే ప్రెస్ క్లబ్ లో న్యాయవాది వర్కోలు రాజలింగం మాట్లాడుతూ న్యాయవాదులు అంటే సామాజిక ఇంజనీర్లు అని కొనియాడుతూ న్యాయవాద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. ఇట్టి కార్యక్రమంలో ప్రభుత్వ పీపీ జీవన్ రెడ్డి, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.