యైటింక్లయిన్ కాలని, ముద్ర: స్తానిక వాటర్ ట్యాంక్ కూడలికి సమీపంలో అసంపూర్తి గా నిలిచిపోయిన డెయిలీ కూరగాయల మార్కెట్ నిర్మాణాన్ని గురువారం రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజ్ ఠాకూర్ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం ఇక్కడికి వచ్చిన ఆయన అసంపూర్తిగా, నిరుపయోగంగా నిలిచిపోయిన మార్కెట్ ను, తిరిగి ఉపయోగంలోకి తేవాలనే సంకల్పంతో రూ. 20 లక్షల నిధులను వెచ్చించి, పునర్నిర్మాణం పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్తానిక ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. అర్థాంతరంగా, అసంపూర్తిగా నిర్మాణం పనులు నిలిచిపోయి, కొన్ని సంవత్సరాలుగా నిరుపయోగంగా మారిన డెయిలీ కూరగాయల మార్కెట్ కారణంగా, స్తానిక ప్రజలు పడుతున్న అవస్థలను దృష్టిలో ఉంచుకుని రూ.20 లక్షల నిధులతో మార్కెట్ పునర్ నిర్మాణం పనులు చేపట్టడం జరిగిందన్నారు. డెయిలీ మార్కెట్ పునర్నిర్మాణం పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు స్తానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మారెల్లి రాజిరెడ్డి, మాజీ కార్పొరేటర్ బి.శంకర్ నాయక్, నాయకులు జి.రాజేష్, సాగంటి శంకర్, జె. దామోదర్, యాదగిరి తిరుపతి, తిరుపతి రెడ్డి, ఆకుల రాజిరెడ్డి, చక్రపాణి, తదితరులు పాల్గొన్నారు.