రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను సమ్మె ద్వారా కార్మికులు తిప్పికొట్టాలని ఏఐటీయూసీ యూనియన్ సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ పేర్కొన్నారు.శుక్రవారం స్థానిక సి.హెచ్.పి ఆవరణలో కార్మికులతో కలిసి ద్వార సమావేశాన్ని నిర్వహించారు.అనంతరం మాట్లాడుతూ ఈ నెల 20 న తలపెట్టే దేశవ్యాప్త ఒక్కరోజు సమ్మెలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.మందమర్రి బ్రాంచ్ సెక్రెటరీ సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు సుదర్శన్,లింగయ్య,హరిరామకృష్ణ, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.