Take a fresh look at your lifestyle.

రేషన్ షాపు ముందు నరేంద్ర మోదీ ఫోటో పెట్టాలి

  • బిజెపి పట్టణ అధ్యక్షులు బాబిదేవ్.

ముద్ర ప్రతినిధి, కల్వకుర్తి : రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుంచి పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పథకంలో కేంద్ర వాటా కూడా ఉన్నందున ప్రతిరేషను దుకాణం వద్ద భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పటాన్ని ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నారు. గురువారం కల్వకుర్తి పురపాలికలో లోని తొమ్మిదవ రేషన్ దుకాణం వద్ద సన్న బియ్యం పంపిణీ పథకాన్ని పరిశీలించి మాట్లాడారు.ప్రతి దుకాణం వద్ద మోదీ పటాన్ని ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మొగిలి దుర్గాప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు నీరు కంటి రాఘవేందర్ గౌడ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ బృంగి వివేకానంద, మాజీ అధ్యక్షులు బోడ నరసింహ, గుండోజో గంగాధర చారీ,బీజేవైఎం జిల్లా సెక్రెటరీ ధన్నోజు నరేష్ చారి, నాయకులు మిరియానం శ్రీకాంత్, పెద్దారి పర్వతాలు, నాప శివ, తోడేటి అరవింద్ రెడ్డి,దేవర్ల కుమార్, రేషన్ డీలర్ మహమ్మద్ సిరాజుద్దీన్, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.