ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ :
కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పలు గ్రామాల్లో ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

కడ్తాల, ఆమనగల్, ఎక్వాయిపల్లి, వెల్దండ, కల్వకుర్తి మరియు పడకల్ గ్రామపంచాయతీలలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అంబేద్కర్ గారి సేవలను కొనియాడుతూ, ఆయన ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.
అనంతరం కల్వకుర్తి పట్టణంలో నిర్వహిస్తున్న రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా వాల్ పోస్టర్లను, అలాగే ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్‌కు సంబంధించిన అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు అధికారులు పాల్గొన్నారు