Take a fresh look at your lifestyle.

జిల్లా విద్యా నిర్మాణ పనులపై కలెక్టర్ సమీక్ష

 

 

సంగారెడ్డి ముద్ర, ఫిబ్రవరి 20:

జిల్లాలోని పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్ లలో చేపడుతున్న మౌలిక సదుపాయాల పనుల ను  వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు.

కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలో మండల విద్యా అధికారులు, సమగ్ర శిక్ష విభాగంతో సమీక్షా  సమావేశం నిర్వహించారు.

పీఎం శ్రీ పథకం, భవిత సెంటర్లు, KGBV సివిల్ వర్క్స్‌తో పాటు పలు విద్యా నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు.

భవిత సెంటర్ల నిర్మాణంలో జహీరాబాద్, మోగుడంపల్లి, కల్హేర్, కొండాపూర్, మనోహర్, మునిపల్లి,పుల్కల్, సిర్గాపూర్, కంగ్టి మండలాల్లో పనుల పురోగతిపై వివరాలు అడిగి,నిర్మాణ వేగం పెంచాలని  కలెక్టర్ ఆదేశించారు.

అలాగే KGBV భవనాల నిర్మాణాల్లో న్యాల్కల్, నాగలిగిద్ద, పుల్కల్, మనూర్, సిర్గాపూర్, వట్పల్లి ప్రాంతాల్లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

పీఎం శ్రీ పథకం కింద సైన్స్ ల్యాబ్‌లు, ఇతర భవన నిర్మాణాల పురోగతిని విద్యా శాఖ అధికారులు కలెక్టర్ కు విచారించారు.

పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టాయిలెట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని, NRGES కింద మంజూరైన టాయిలెట్లను మార్చి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

పీఎం శ్రీ బడ్జెట్, UDISE డేటా, ప్రీ-ప్రైమరీ పాఠశాలల అంశాలు కూడా సమావేశంలో పరిశీలించబడ్డాయి. సంబంధిత విభాగాలకు డేటా ఖచ్చితత్వం, పనితీరుపై సూచనలు చేశారు.

ఈకార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, మండల విద్యాధికారులు, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.