- మెదక్ జిల్లాకు 10 పథకాలు.
ముద్ర ప్రతినిధి, మెదక్: కరీంనగర్ లో జరిగిన జోనల్ లెవెల్ పోలీస్ డ్యూటీ మీట్లో మెదక్ కు 10 పథకాలు సాధించారు. ఈ సందర్బంగా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు పథకాలు సాధించిన సిబ్బందిని ఘనంగా సన్మానించారు. వచ్చే నెలలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి అల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ కు సెలెక్ట్ కావాలని సూచించారు. మెడల్ సాధించిన సిబ్బందికి రివర్డ్ మంజూరు చేశారు.యాక్సెస్ కంట్రోల్ విభాగంలో పోలీస్ కానిస్టేబుల్ దుర్గ ప్రసాద్, పోలీస్ కానిస్టేబుల్ సిద్ధిరాములు ఇద్దరికి బంగారు పథకం సాధించారు.ASC గ్రౌండ్ సెర్చ్ ఈవెంట్ విభాగంలో ARHC రవీందర్, పీసీ నర్సిములు రెండవ స్థానం సాధించగా వెండి పథకం లభించింది.కంప్యూటర్ విభాగంలో పీసీ సతీష్ రావు మొదటి స్థానం పొందగా బంగారు పథకం సాధించాడు. కంప్యూటర్ ఆటోమేషన్ విభాగంలో కూడా మూడవ స్థానం సాధించాడు.సైంటిఫిక్ ఎయిడ్ ఇన్వెస్టిగేషన్ ఈవెంట్ విభాగంలో పీసీ అశ్వాక్ మూడవ స్థానం సాధించాడు.ఫోటో గ్రఫీ, వీడియో గ్రఫీ విభాగంలో పీసీ శ్రీధర్ గౌడ్ రెండింటిలో మొదటి, రెండు స్థానాలు సాధించి 2 బంగారు, 2 వెండి పథకాలు కైవసం చేసుకున్నాడు. డాగ్ స్క్వాడ్ నార్కో టిక్ విభాగంలో పీసీ శ్రవణ్ కుమార్ మూడవ స్థానం పొందాడు. ఈ కార్యక్రమంలో మెదక్ అదనపు ఎస్పీ ఎస్. మహేందర్, ఏఆర్ డియస్పి రంగా నాయక్, ఆర్ఐ శైలందర్, సిబ్బంది పాల్గొన్నారు.
