Take a fresh look at your lifestyle.

ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను మంగళవారం పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు నాయకులతో కలిసి వైయస్సార్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. పేద ప్రజలకు వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.