- స్క్రీనింగ్ మిషిన్లను ప్రారంభించిన ఎంపీ ఈటెల, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
కుషాయిగూడ, ముద్ర విలేఖరి: ఏఎస్ రావు నగర్ డివిజన్ జమ్మిగడ్డలోని కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ మిషన్లను అందజేశారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐ ఓ సి) సహకారంతో మహిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అందజేసిన ఐ బ్రెస్ట్ , సెర్వికల్ క్యాన్సర్ స్క్రీనింగ్ డివైస్ మిషన్లను మంగళవారం కేంద్రం ఆవరణలో ఎంపీ ఈటెల, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిలు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రిల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ మిషన్లో అందజేసిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, మహిత స్వచ్ఛంద సంస్థలను వారు అభినందించారు. ఈ సందర్భంగా కుషాయిగూడ పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ… ఇటీవల కాలంలో క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ముఖ్యంగా మహిళల్లో ఈ పరిస్థితి తీవ్రంగా కనబడుతుంది అన్నారు. ప్రథమ దశలో క్యాన్సర్ గుర్తించేందుకు స్వచ్ఛంద సంస్థ అందజేసిన ఐ బ్రెస్ట్, సెర్వికల్ క్యాన్సర్ స్క్రీనింగ్ డివైస్ లు ఎంతో దోహదపడతాయన్నారు. రూ.25 లక్షల విలువగల ఈ రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ రెండు స్క్రీనింగ్ మిషన్లతో వెంటనే ఫలితాలు వస్తాయన్నారు. ఇలా క్యాన్సర్ ను మొదటి దశలో గుర్తించి మెరుగైన వైద్యం కోసం పెద్ద హాస్పిటల్ కు పంపించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ , బేతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ మల్కాజ్గిరి జోన్ డాక్టర్ శోభా రాజ్, కీసర జోన్ డాక్టర్ సత్యవతి, డాక్టర్ సుప్రియ, డాక్టర్ పుష్పాంజలి, మహితా డైరెక్టర్ పి. రమేష్ శేఖర్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.