Take a fresh look at your lifestyle.

పాలన మరిచి రియల్ ఎస్టేట్ వ్యాపారాలేనా..? మూసి బాధితుల పక్షాన హరీష్ రావు హెచ్చరిక

పాలన మరిచి రియల్ ఎస్టేట్ వ్యాపారాలేనా….

మూసి అభివృద్ధికి తామంతా ముందుంటాం..
ప్రజల నుండి దోపిడీని ఖండిస్తున్నాం.

– మూసి బాధితుల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు

 

ముద్ర ప్రతినిధి, బండ్లగూడ:

అహింసా ఆయుధాన్ని అందించిన గాంధీజీ విగ్రహం ఏర్పాటు అంటూ హింసాత్మకంగా ప్రజలను రోడ్డున పడేస్తామంటే ఊరుకునేది లేదని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో టిప్పు ఖాన్ బ్రిడ్జి వద్ద మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ రెండు బ్లాకులు కూల్చివేయనున్న విషయం విధితమే. 440 కుటుంబాలు ఇక్కడ రోడ్డున పడుతున్నాయి. బాధితులకు తాము అండగా ఉన్నామని, ఒక్క ఇల్లు కూడా పోనిచ్చేది లేదని వారికి భరోసా కల్పిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో మూసి పరివాహక ప్రాంతాల్లో ఆదివారం పర్యటించారు. అనంతరం మధు పార్క్ రిడ్జ్ లో బాధితులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… మూసీ ప్రక్షాళన,మూసి అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అర్థం పర్థం లేని ప్రాజెక్టులతో ప్రజలను పెడితే ఊరుకునేది లేదన్నారు. ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే చట్టపరంగా, ప్రత్యక్షంగా కూడా పోరాడుతామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టలేదు కానీ, ఎన్నో ఇల్లులు ఇప్పటికే కూల్చి సామాన్యుల బ్రతుకులు రోడ్డున పడేసారన్నారు. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి డబ్బులు, రైతుబంధుకు డబ్బులు లేవు, మంచి బియ్యంతో పిల్లలకు భోజనాలు పెట్టడానికి డబ్బులు లేవు, ఇదేమిటని అడిగితే తల కోసుకోవాలా అని ముఖ్యమంత్రి అంటున్నాడు. అందాల పోటీలు, ఫుట్ బాల్ అంటూ వదల కోట్లు ప్రజాధనం వృధా చేసి, ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రజా పాలన మరిచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏది చేసిన రియల్ ఎస్టేట్ కోసమే చేస్తున్నారని మండిపడ్డారు. ఆరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు లాక్కుంటానని, ఫార్మాసిటీ కాదు ఫ్యూచర్ సిటీ అని, హైడ్రా అని ఇలా ఏది చూసినా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే చేస్తున్నారన్నారు. ఇప్పుడు కూడా తమ ఇల్లులు, భూములు లాక్కొని అంబానీ, ఆదాని, మై హోమ్ వ్యాపారవేత్తలకు కట్టబెట్టే పనుల్లో రేవంత్ రెడ్డి ఉన్నారన్నారు. అప్పుడు టిఆర్ఎస్ మేనిఫెస్టో ఈ మధు పార్క్ రిడ్జ్ లోనే తమ నాయకుడు కేసీఆర్ రూపొందించారని గుర్తు చేశారు.
తమపై కోపంతో వద్దు…
ప్రపంచం వికరంగా గుర్తింపు తెచ్చుకుంటున్న హైదరాబాద్ అభివృద్ధికి తాము సహకరిస్తామని హరీష్ రావు అన్నారు. తమపై కోపంతో ప్రజలపై కక్ష సాధింపులు వద్దన్నారు. మూసి అభివృద్ధికి ఎస్ పి టి ల నిర్మాణానికి తాము 3800 కోట్లు ఖర్చు చేశామని, కాలేశ్వరం కూడా కట్టించామని గుర్తు చేశారు. అక్కడి నుండి గోదావరి నీళ్లు మూసికి తేవడానికి రేవంత్ రెడ్డి పైప్ లైన్లు నిర్మించి, మూసీ ప్రక్షాళన తో అభివృద్ధి చేయాలన్నారు. ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా మూసి అభివృద్ధి చేయాలని ఆనాడు కెసిఆర్ అన్నారని, ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఇండ్లు కూల్చడం, భూములు లాక్కోవడం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం పైనే దృష్టి పెట్టాలని ఆ గ్రామం వ్యక్తం చేశారు. జెసిబి లు పెడతామంటే తాము ముందు కూర్చుంటామని తమపై నుండి జెసిబి లు పోనివ్వాలని ఆయన హెచ్చరించారు.
రంగారెడ్డి జిల్లా అంటే ఎందుకు చులకన….
ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కృష్ణారావులు మాట్లాడుతూ….. వివిధ రకాలుగా భూములు లాక్కోవడం, ఇల్లు కూల్చడం రంగారెడ్డి జిల్లాలోనే చేస్తున్నారన్నారు. తమ జిల్లా ప్రజలు అంటే అంత చులకనగా ఉందని వారు మండిపడ్డారు. ఇప్పటివరకు కూడా మూసి వరదల లెవెల్ మార్కులు కూడా ఎక్కడ వేయలేదు అన్నారు. ఇటీవల వరదలలో నగరం మునిగిపోయిన మూసీ పక్కన ఉన్న మధు పార్కు రిడ్జ్ వద్ద తరిదాపుల్లోకి కూడా వరద నీరు రాలేదని గుర్తు చేశారు. బాపు ఘాటు నుండి ఇక్కడి వరకు చాలా ఖాళీ స్థలం ఉందని, ఉన్న స్థలంలో మీ ప్రాజెక్టులు నిర్మించుకోవాలని సూచించారు. మొదలు మూసిలో పూడికలు తీసి లోతు పెంచుతూ ప్రహరీ గోడల హద్దులు నిర్మించి అభివృద్ధి ప్రారంభించాలన్నారు.
తెలంగాణకు ఎవరు రాకుండా చేస్తున్నారు….
ఈ సమావేశంలో భాగంగా మూసి ప్రాజెక్ట్ బాధితులు తమను రోడ్లపై పడేయొద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ… మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్లో దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి వచ్చిన ప్రజలు నివాసం ఉంటున్నారన్నారు. ప్రపంచ నగరాలకు పోటీపడుతున్న హైదరాబాద్ నగరంలో కూడా దేశవ్యాప్త ప్రజలు, విదేశీయులు కూడా ఉంటున్నారని వారు గుర్తు చేశారు. ఇలా ప్రజలపై దౌర్జన్యం చేస్తూ ఇండ్లను లాక్కుంటే వేరే ప్రాంతాల వారు భయంతో ఇక్కడికి ఎలా రాగలరు. బయట వనరులు లేకపోతే నగర అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి అసాధ్యమన్నారు. ప్రజలకు ఇబ్బందులు పెట్టకుండా అభివృద్ధి పనులు చేస్తే తామంతా స్వాగతిస్తామన్నారు. ఈ సమావేశంలో రాజేంద్రనగర్ బి ఆర్ ఎస్ ఇంచార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, మాజీ మేయర్ ప్రేమ్ గౌడ్, దేవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.