Take a fresh look at your lifestyle.

వృద్ధ దంపతులపై దాడి 5 తులాల బంగారం దోపిడీ సంఘటన స్థలాన్ని పరిశీలించిన అదనపు ఎస్పీ మహేందర్

ముద్ర ప్రతినిధి, మెదక్:
చిన్న శంకరంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జంగరాయి గ్రామంలో మధ్యాహ్న సమయంలో దోపిడి ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తి వృద్ధ దంపతులు అంజయ్య, సావిత్రి నివాసంలోకి ప్రవేశించి సుత్తితో దాడి చేసి, వారి వద్ద ఉన్న సుమారు 5 తులాల బంగారు ఆభరణాలను దోచుకుని బైక్‌పై పరారయ్యాడు.
దాడిలో గాయపడిన దంపతులను స్థానికులు వెంటనే మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ సంఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. దుండగులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తూ, నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు. వెంట తూప్రాన్
డిఎస్పి నరేందర్ గౌడ్, సీఐ వెంకట రాజా గౌడ్, ఎస్సై నారాయణ గౌడ్ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.