Take a fresh look at your lifestyle.

పిఎసిఎస్ చైర్మన్ గా రాంరెడ్డి

 

ముద్ర,యాదగిరిగుట్ట :

యాదగిరిగుట్ట పిఎసిఎస్ చైర్మన్ గా ఉమ్మడి రాంరెడ్డి బుధవారం యాదగిరిగుట్ట కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి వారి అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వం పిఎసిఎస్ పాలకవర్గానికి నామినేటెడ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రయత్నించగా తామంతా కోర్టుకు వెళ్లామని గౌరవ హైకోర్టు వారు తమకు అనుకూలంగా తీర్పునిచ్చారని అన్నారు తిరిగి తమనే ఎన్నికలు జరిగే వరకు బాధ్యతలు చేపట్టాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని అన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా పిఎసిఎస్ లకు ఎన్నికలు జరపాలని అన్నారు. నామినేటెడ్ పద్ధతిలో కాకుండా ఎన్నికలు జరిపితేనే రైతులకు న్యాయం జరుగుతుందని అన్నారు. రైతులకు సకాలంలో యూరియా విత్తనాలు అందించేందుకు తగిన పంట పెట్టుబడి రుణాలు అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. రైతులకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా వారిని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ సందర్భంగా తిరిగి పిఎసిఎస్ చైర్మన్ గా ఎన్నికైన ఇమ్మడి రామ్ రెడ్డికి పలువురు గ్రామాల సర్పంచులు రైతులు నాయకులు పెద్ద ఎత్తున పూలమాలలు శాలువాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు నాయకులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.