ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కలాశాలలో సహజయోగ ధ్యాన పరిచయం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళపల్లి శ్రీవాణి రవి కుమార్ పాల్గొనగా రాష్ట్ర సమన్వయకర్త గౌరీ కృష్ణ సత్యాన్వేషకులకు సహజయోగ గురించి ప్రసంగించారు.
