యువత వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలి :ఎమ్మెల్యే కుంభం
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
యువత వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరి
పట్టణ ప్రజలకు తక్కువ ధరకే నిత్యావసర వస్తువులను చేరవేసే లక్ష్యంతో రూపొందించిన ‘బిగ్ మార్ట్’ మొబైల్ యాప్‌ను ఆయన ఆవిష్కరించారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, యువ టీమ్ సభ్యుడు మచ్చ భరత్ తన సొంత మేధస్సుతో ఈ యాప్‌ను రూపొందించడం అభినందనీయమని కొనియాడారు. బిగ్ మార్ట్ యాప్ ద్వారా భువనగిరి ప్రజలకు సమయం, డబ్బు ఆదా అవుతుందని, తక్కువ ఖర్చుతోనే సేవలు పొందవచ్చని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి, 28 వార్డు కౌన్సిలర్ సూదగాని సరిత, పీసీసీ మాజీ కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్, కౌన్సిలర్లు చల్లగురుగుల రఘు బాబు, జాలిగం విగ్నేష్, నర్సింగ్, జంగిటి వినోద్, యువ టీం కన్వీనర్ సూదగాని రాజు, పట్టణ కాంగ్రెస్ నాయకులు, వార్డు పెద్దలు కైరంకొండ వెంకటేష్, వంగరి లక్ష్మీ నారాయణ, కొల్లోజు. సతీష్ ,వెల్దుర్తి రఘునాథ్,వెల్దుర్తి గోపి, వెల్దుర్తి. శ్రీనాథ్, చుంచు హరీష్, గంజి రాజు, భాస్కర్ పంతులు పాల్గొన్నారు.