Take a fresh look at your lifestyle.

పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

మోత్కూర్ ముద్ర న్యూస్:

మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు .పరీక్షల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.ఆయన వెంట స్థానిక తహశీల్దార్ పి జ్యోతి, మున్సిపల్ కమిషనర్ కే సతీష్ కుమార్, పరీక్ష కేంద్రం చీఫ్ సూపర్ ఇండెంట్ పి విజయలక్ష్మి, డిఓ కవిత, సిట్టింగ్ స్క్వాడ్ స్థానిక డిప్యూటీ తహసిల్దార్ ఎస్ వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.