- కరుణ కుమారి కి బాధ్యతలు.
ఖమ్మo, ముద్ర విలేకరి: ఉమ్మడి ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన కార్యదర్శిగా కరుణ కుమారి బాధ్యతలు చేపట్టారు.ఇప్పటివరకు ఈ పోస్టులో ఉన్న వేల్పుల అర్జున్ ను సస్పెండ్ చేశారు.పలు ఆరోపణ నేపథ్యంలో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శ్రీజ నూతన కార్యదర్శి బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారు. వరంగల్ జిల్లాలో పనిచేస్తున్న కరుణకుమారికి ఖమ్మం కూడా అదనపు బాధ్యతలు ఇచ్చారు.ఈ మేరకు ఆమె బాధ్యతలు స్వీకరించారు.