Take a fresh look at your lifestyle.

మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

  • కార్మిక హక్కులను కాపాడుకుందాం.
  • మున్సిపల్ కార్యాలయ సిబ్బందికి సమ్మె నోటీస్.
  • ఎం శంకర్ నాయక్ సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి.

అచ్చంపేట ముద్ర విలేఖరీ: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో మున్సిపాలిటీ కార్యాలయంలో మే 20న జరిగే సార్వత్రిక సమ్మెకు సిఐటియుసి సంఘం వారు సిబ్బందికినోటీసు ఇచ్చారు. దశాబ్ద కాలాలు పోరాటం చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాసే ప్రయత్నం చేస్తే సహించేది లేదని కేంద్ర ప్రభుత్వానికి తిరుగుబాటు తప్పదని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎం శంకర్ నాయక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.అచ్చంపేట పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం సిబ్బంది సానిటరీ ఇన్స్పెక్టర్ గణేష్ కు సిఐటియు సంఘం కార్మికుల ఆధ్వర్యంలో సమ్మె నోటీసు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్ద కాలం పోరాటం చేసి 44 కార్మిక చట్టాలను సాధించుకుంటే 29 చట్టాలను కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వము రద్దుచేసి నాలుగు లేబర్ కోళ్లు తీసుకువచ్చి కార్మికులు పోరాటం చేసే హక్కు లేకుండా సమ్మె చేసే హక్కు లేకుండా కాల రాయడం సంఘాలు ఐక్యతతో ఉద్యమాలు చేయకుండా చీల్చివేసే ప్రయత్నం కోసమే ఇట్లాంటి చట్టాలు తీసుకొస్తున్నాడని ఆ చట్టాలు వెనక్కి తీసుకోవాలని ఉన్న చట్టాలను పునరుద్ధరించాలని మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మికులు అత్యధిక సంఖ్యలో పాల్గొని అచ్చంపేట పట్టణంలో ర్యాలీ నీ జయప్రదం చేయాలని శంకర్ నాయక్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి బి రాములు మున్సిపల్ కార్మికులు సాయిలు గంగయ్య సైదులు వెంకటయ్య బాలమ్మ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.