ముద్ర ప్రతినిధి, జగిత్యాల: పహాల్గామ్ సంఘటన విషయంలో పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధంలో భారత్ సైనికులు సాదిస్తున్న విజయానికి సంఘీభావం తెలుపుతూ జగిత్యాల జిల్లా కేంద్రంలో న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా జగిత్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు మాట్లాడుతూ భారతదేశ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాద సంస్థలు అయిన జైష్ ఏ మహమ్మద్, ఐసిస్ లాంటి తీవ్రవాద సంస్థలు హిందూ పర్యాటకుల మీద దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. దానికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను పేల్చేయడం శుభపరిణామని తీవ్రవాదాన్ని మట్టుబెట్టడంలో భారత ప్రభుత్వం సైనికులకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం భారత సైన్యంలో ఇద్దరు మహిళా కమండోలు చూపిన తెగువ అనిర్వచనీయమన్నారు. పాకిస్తాన్ ను అంతమోందించడానికి ఇద్దరు మహిళలు కాళికదేవి అవతారం ఎత్తితేనే ఇంతగా ఉంటే ప్రతి భారతీయుడు పరశరాముని అవతారం ఎత్తితే పాకిస్తాన్ పరిస్థితి ప్రపంచం పటంలో కనిపించదని అన్నారు. భారత సైనికులకు న్యాయవాదుల మద్దతు ఎల్లవేళలా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అందె మారుతి, న్యాయవాదులు భోగ ఓంప్రకాష్, మర్రిపెల్లి సత్యమ్, భూమి రమణ, జున్ను రాజేందర్,రాజేశుని జీవన్, మదన్ మోహన్, అనుమల్ల కృష్ణహరి, కరబూజ నర్సయ్య, రాజేందర్ రావు తదితరులు పాల్గొన్నారు.