Take a fresh look at your lifestyle.

ముగిసిన”వారాహీదేవి” నవరాత్రి ఉత్సవాలు

  • ఆలయ ఫౌండరీ ట్రస్ర్టీ చైర్మన్ చెల్లం స్వరూప.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : సకల చరాచర సృష్టిని పాలించే సృష్టి స్థితి లయకారిని శ్రీ చక్రవాసిని, శ్రీ లలితమాత సైన్యాధిపతి వారాహీ దేవి నవరాత్రి ఉత్సవాలు శనివారం తో ముగిశాయని పొలాస 108 శ్రీ చక్ర సహిత శ్రీ లలితామాత దేవాలయ ఫౌండరీ ట్రస్టీ చైర్మన్ చెల్లం స్వరూప సత్తయ్య తెలిపారు. జగిత్యాల రూరల్ మండలంలోని గత నెల26 న పొలాసలో కొలువై ఉన్న లలితమాత ఆలయంలో ప్రారంభమైన వారహీదేవి నవరాత్రి ఉత్సవాలు రోజుకో విధమైన అలంకారంలో వారహీదేవి దర్శనమియగా భక్తులు, సుహాసినిలు మూలమంత్రం జపిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం కుంకుమ పూజలు, లలితామాత సహస్రనామా పారాయణం గావించారు.9 రోజుల పాటు ఆలయంలో సాయంత్రం వేళలో వారాహీదేవిని అందంగా అలంకరించి అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచారు. వారాహిదేవిమాలధారణ చేసిన భక్తులు 9 రోజులుఉదయం, సాయంత్రం పూజ కార్యక్రమాలు చేస్తూ ఏకభూక్తం పాటించి శనివారం విరమణ చేశారు.నవరాత్రుల్లో లలితామత ఆలయం భక్తులతో కిటకిటలాడిందని, అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగిందని చెల్లం స్వరూప తెలిపారు. నవరాత్రి ఉత్సవాళ్ళో  పాంపట్టి రవీందర్, మార కైలాసం, మార రాజేశం, చెల్లం సత్తయ్య,జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, ఉటూరి కళ్యాణి, అర్చన, గోపతి స్వప్న, బొడ్డు వనిత, పొన్నం లావణ్య, మహేందర్, లలితామాత సేవా ట్రస్ట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.