- మాజి జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్.
- అంబేద్కర్ నగర్ లో ఘనంగా మాజీమంత్రి జన్మదిన వేడుకలు.
- ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బెంచీలు అందజేసిన పట్టణ ఆర్గనైజింగ్ సెక్రటరీ కీసర వేణుగోపాల్ రెడ్డి.
సూర్యాపేట, ముద్ర ప్రతినిధి: మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సూర్యాపేట జిల్లా ను వేలకోట్ల రూపాయలతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని మాజీ జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్ అన్నారు. శుక్రవారం స్థానిక అంబేద్కర్ నగర్ నందు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు జన్మదిన వేడుకలను పట్టణ ఆర్గనైజింగ్ సెక్రటరీ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు బెంచీలను బహుకరించారు. ఈ సందర్భంగా గోపగాని వెంకటనారాయణ మాట్లాడుతూ మాజి మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేటలో జిల్లా కేంద్రంలో సద్దల చెరువు మినీ ట్యాంక్ బండ్ ను అభివృద్ధి చేశారని, అలాగే సూర్యాపేటకు మెడికల్ కాలేజీ తీసుకొని వచ్చారని ఆయన తెలియజేశారు. సూర్యాపేట పట్టణంలో మహాప్రస్థానం నిర్మించారని పట్టణంలో అనేక వార్డులలో పార్కుల నిర్మాణం చేశారని ప్రతి వార్డులో కూడా అంతర్గత రోడ్లను నిర్మాణం చేశారని, మెయిన్ రోడ్ విస్తరణ చేశారని అన్నారు. సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి జన్మదినం అంటే అందరికీ పండుగ రోజు అని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. జగదీష్ రెడ్డి జన్మదినం సందర్భంగా సూర్యాపేట పట్టణ ఆర్గనైజింగ్ సెక్రటరీ కీసర వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం ఏర్పాటు చేశారు. వార్డులోని దాదాపు 400 ఇళ్లకు స్వీట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బూర బాల సైదులు గౌడ్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆకుల లవకుశ, వెన్న శ్రీనివాస రెడ్డి, బత్తుల రమేష్, ఎల్గూరి రాంబాబు గౌడ్, మట్టరాజు యాదవ్, బొల్లెద్దు జానీ, షకిల్, వార్డు నాయకులు వెంకన్న, రమణ, శంభయ్య, రహీం, బిట్టు శివ, విజయ్, నవీన్, వెంకన్న, రమణ తదితరులు పాల్గొన్నారు.
