Take a fresh look at your lifestyle.

ఆర్ట్స్ కళాశాలలో గోరింటాకు మహోత్సవం

ముద్ర ప్రతినిధి, హనుమకొండ: హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో శుక్రవారం ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో గోరింటాకు మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి, మహిళా ఉద్యోగస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జ్యోతి మాట్లాడుతూ భారతీయ ప్రాచీన సాంప్రదాయాలలో భాగంగా ఆషాడ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం సాంప్రదాయ బద్ధం గా వస్తుందని, ఇది సాంప్రదాయమే కాకుండా సైన్స్ పరంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీదేవి, శ్రీలత, రమేష్, చందర్ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.