Take a fresh look at your lifestyle.

బండి సంజయ్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు నిరసన

 

ముద్ర, కరీంనగర్ :
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ లో బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగాయి. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ లో భారీ ఫ్లెక్సీ ప్రదర్శిస్తూ బండి సంజయ్ కుమార్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మైనర్ బాలికకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. బి.అర్.ఎస్ నేతలు ఫ్లెక్సీ దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బి.అర్.ఎస్ నేతల చేతుల్లోంచి ఫ్లెక్సీని బలవంతంగా లాక్కున్నారు. దీంతో పోలీసులకు, నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బండి సంజయ్ మంత్రిగా ఉంటే మైనర్ బాలికకు న్యాయం జరగదని కాబట్టి ఆయన రాజీనామా చేయాలని కోరారు. లేకుంటే ప్రధాని మోదీ బండి సంజయ్ ను మంత్రివర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేసారు.

Leave A Reply

Your email address will not be published.