ముద్ర కూకట్‌పల్లి:
కేపీహెచ్‌బీ స్థానిక ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్‌లో కేపీహెచ్‌బీ పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, మరియు మాదకద్రవ్యాల నిరోధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 400 మంది విద్యార్థులు హాజరయ్యారు.

సదస్సులో డీఐ రవి మాట్లాడుతూ.. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. యువత డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని కోరారు. విద్యార్థుల చురుకైన భాగస్వామ్యంతో కార్యక్రమం విజయవంతమైందని ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి,నిర్వాహుకులు తెలిపారు.