- సావిత్రిబాయ్ పూలే ఫౌండేషన్ ఉపాధ్యక్షురాలు దాసరి రజనీ
ముద్ర ప్రతినిధి, జగిత్యాల : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన మీదటే ఎన్నికలు నిర్వహించాలని సావిత్రిబాయ్ పూలే ఫౌండేషన్ ఉపాధ్యక్షురాలు దాసరి రజనీ అన్నారు. రజనీ మాట్లాడుతూ రాష్ట్రంలో కుల గణన చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్న మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.గ్రామ పంచాయతీ,మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేసీ తమిళనాడు తరహాలో రిజర్వేషన్ ప్రకటించాకే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వాన్ని రజని కోరారు.