Take a fresh look at your lifestyle.

జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో ఆషాఢ మాసపు గోరింటాకు వేడుకలు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణం లోనీ జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో ఆషాఢ మాసం పురస్కరించుకొని ఆషాఢ మాసపు గోరింటాకు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ ఆషాడ మాసంలో మహిళలు జరుపుకునే ఒక సాంప్రదాయ వేడుకలో మహిళలు గోరింటాకును చేతులకు, కాళ్లకు పెట్టుకుంటారని, ఇది ఒక సాంస్కృతిక ఆరోగ్యపరమైన ఆచారమన్నారు.ఆషాడ మాసంలో వచ్చే వర్షాల వల్ల వాతావరణం చల్లగా మారుతుందని, ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవడం వలన చర్మవ్యాధుల నుండి రక్షణ పొందవచ్చని నమ్మకం, శరీరంలోని వేడిని తగ్గించడానికి, చల్లదనాన్ని అందించడానికి గోరింటాకు ఉపయోగపడుతుందని, అలాగే గోరింటాకు లో కొన్ని ఔషధ గుణాలు కూడా ఉన్నాయని ఇది చర్మ ఆరోగ్యానికి మంచిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ , ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.