Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ చేతగాని పాలనతో ప్రజలకు ఇబ్బందులు.. కలెక్టరేట్ ముందు బిజెపి ధర్నా

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
కాంగ్రెస్ చేతగాని పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు గొంగిడి మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం
బిజెపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు
జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షులు ఊట్కూరి అశోక్ గౌడ్ అధ్యక్షతన, జిల్లాలోని స్థానిక సమస్యలపై ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా ముఖ్యఅతిథి హాజరైన మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోసం అమలుకు నోచుకోలేని పథకాలు ఇస్తామని చెప్పి నెరవేర్చడంలో విఫలం చెందిందని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ముఖ్యంగా డబుల్ బెడ్ రూములు, నిరుద్యోగ భృతి, చేయూత వితంతు,వృద్ధాప్య, వికలాంగుల పింఛన్ 4000,6000,రైతు భరోసా, యువతకు జాబ్ క్యాలెండరు, మహిళలకు 2500, దళితులకు మూడు ఎకరాల పొలం ఇంకా ఎన్నో హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర పప్రధాన కార్యదర్శి పడమటి జగన్ మోహన్ రెడ్డి, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు జాయినపల్లి శ్యాంసుందర్ రెడ్డి, పట్నం శ్రీనివాస్, వేముల నరేష్, గూడూరు నరోత్తం రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిలు కొప్పుల యాదిరెడ్డి, చంద మహేందర్ గుప్తా, కాదూరి అచ్చయ్య, జిల్లా కోశాధికారి సోమ నర్సయ్య, జిల్లా కార్యదర్శులు తడిసిన మల్లారెడ్డి, కామిటికారి కృష్ణ,లక్ష్మీనారాయణ, మేడి కోటేష్, జిల్లా వివిధ మోర్చా అధ్యక్షులు ఫకీర్ రాజేందర్రెడ్డి, పట్నం కపిల్, కస్తూరి మాధురి, జిల్లా మీడియా కన్వీనర్ ఆకుతోట రామకృష్ణ, ఏలె చంద్రశేఖర్, పాదారాజు ఉమా శంకర్ రావు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఉడుత భాస్కర్, కారుపాటి రాజు,బండారు లోకేష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.