Take a fresh look at your lifestyle.

ఏషియన్ పెయింట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు తలకిందులుగా నిరసన

 

14 వ రోజు కి చేరిన సమ్మె

సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి యూనియన్ గౌరవ అధ్యక్షులు పున్నం రవి మాట్లాడుతూ…… గత 14 రోజులు నుంచి సమ్మె చేస్తున్నటువంటి ఏషియన్ పెయింట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ల సమస్యలపై యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఈరోజు తలకిందులుగా నిరసన వ్యక్తం చేయడం జరిగింది తెలిపారు,
*ఏషియన్ పెయింట్ గోదాంలో వెంకట్ లాజిస్టిక్ దుబ్బ నాగభూషణం ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీల వద్ద 10 సంవత్సరాల నుండి 60 మంది డ్రైవర్స్ తమ సొంత వాహనాలు పెట్టీ సరఫరా పనితో పాటు హమాలి లోడింగ్ అన్లోడింగ్ పనులు చేస్తున్నారని ఇప్పటివరకు ఆ యొక్క వాహనాలకు అగ్రిమెంట్ లేకపోవడం నిబంధనలకు విరుద్ధం డ్రైవర్ల తో లోడింగ్ అన్లోడింగ్ హమాలీ పనులు చేయిస్తూ హమాలి చార్జీలు చెల్లించకుండా వెంకట్ లాజిస్టిక్ నాగభూషణం ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు మోసం చేస్తున్నారని, బానిస లాగా చూస్తున్నారని, మాకు శ్రమ దోపిడి ,వెట్టి చాకిరి విముక్తి కల్పించాలని కోరారు, వెంటనే ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలూ 60 వాహనాలకు అగ్రిమెంట్ చేయాలని , నెలకు ఒక వాహనం మీద రూ.2800/- రూ”ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు తీసుకోవడం వల్ల ఏజెన్సీలు లాభాలు పొందుతున్నారు,

యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కీసర మల్లేశం మాట్లాడుతూ……. మా డ్రైవర్ల సమ్మె ఈరోజు 14 వ రోజు కి చేరుకుంది సమ్మె డిమాండ్ల పట్ల వ్యవహరిస్తున్న ది వరంగల్ , హైదరాబాదు ఇతర జిల్లాలలో ఉన్నటువంటి ఏషియన్ పెయింట్ గోదాములలో డ్రైవర్లకు లోడింగ్ అన్లోడింగ్ చార్జీలు చెల్లిస్తున్నారు , ఏషియన్ పెయింట్ కంపెనీ వాళ్ళు హమాలి కిలోమీటర్స్, డ్రైవర్లకు బెటా ,అన్ని సౌకర్యాలు అందిస్తున్నారు, కానీ ట్రాన్స్పోర్ట్ యజమాన్యం డ్రైవర్లకు అందించకుండా డబ్బులు దండుకుంటుంది , తెలిపార
ఎసియన్ పెయింట్స్ కంపెనీ వాళ్ళు కల్పిస్తున అనేక సౌకర్యాలు మాకు అందించకుండా తీరని అన్యాయానికి గురి చేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు ,
సరుకు లోడింగ్ అన్లోడింగ్ పోటీగా బయట వాహనలను తీసుకొని వచ్చి డ్రైవర్లకు డ్రైవర్లకు మధ్య గొడవలు సృష్టించాలని యజమాన్యం చూస్తుంది. మా యొక్క సమస్యలు పరిష్కరించే వరకు నిరసనలు ఆందోళన ,పోరాటాలు చేస్తామని తెలిపారు, అట్లాగే డ్రైవర్లకు 10 లక్షలు ప్రమాద భీమా ఏసియన్ పెయింట్ కంపెనీ బాధ్యత తీసుకోని చేయించాలని కోరారు,

ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు కామల్ల మహిపాల్, కోశాధికారి ఉత్తమల్ల వెంకటేశ్ , సహాయ కార్యదర్శి మూగ తిరుపతి, లింగంపల్లి అనిల్ ,ముచ్చర్ల రాజశేఖర్, ఏ రవి ,కే మహేష్ ఏ రమేష్, సిహెచ్. రాజేష్, మహేష్, విజయ్ ,వెంకటేష్ శ్రీనివాస్, నరేష్, మధు, కళాధర్ ,శ్రీకాంత్ విజయ్, రాజు, మోహన్, రాజశేఖర్ , 40 ట్రాన్స్పోర్ట్ మంది డ్రైవర్లు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.