Take a fresh look at your lifestyle.

శ్రీపాదరావుకు కలెక్టర్, ఎస్పీ నివాళులు

ముద్ర ప్రతినిధి, మెదక్:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించారు. జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖ ఆధ్వర్యంలో శ్రీపాద రావు చిత్రపటానికి కలెక్టర్ ప్రతిమా సింగ్ నివాళులు అర్పించారు. డిఆర్ఓ భుజంగరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసన సభ స్పీకర్ గా శ్రీపాదరావు అందించిన సేవలను స్మరిస్తూ, శ్రద్ధాంజలి ఘటించారు.
పోలీస్ కార్యాలయంలో
దుద్దిళ్ల శ్రీపాదరావు సేవలు చిరస్మరణీయమని ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు అన్నారు. మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శ్రీపాదరావు
చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, ఆర్ఐలు శైలందర్, రామకృష్ణ, సీఐలు సందీప్ రెడ్డి, కృష్ణ మూర్తి, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.