Take a fresh look at your lifestyle.

సిద్దిపేట లో యుద్దొన్మాద వ్యతిరేక ర్యాలీ..

 

* ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ర్యాలీ..

* పాల్గొన్న వివిధ సంఘాలు,
ఉద్యోగులు
* ఉపాధ్యాయులు,కవులు, రచయితలు

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

అమెరికా యుద్దోన్మా దాన్ని బ్యాతిరేకిస్తూ, ప్రపంచ శాంతిని కోరుకుంటూ ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు ర్యాలీ సిద్దిపేట హైస్కూల్ గ్రౌండ్ నుండి మొదలుకొని కాంచిట్ చౌరస్తా, విక్టరీటాకీస్ చౌరస్తా, మీదుగా ప్రధాన రహదారి మీదుగా పాత బస్ స్థాండ్ అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ దారి పొడవునా అమెరికా యుద్ధ ఉన్మాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిద్దిపేట అంబేద్కర్ విగ్రహం సర్కిల్ లో వివిధ సంఘాల ప్రతినిధులు రంగాచారి, పాపయ్య మాట్లాడుతూ ప్రపంచ పోలీసుగా మారియిన అమెరికా అన్ని ప్రపంచం లోని అన్ని దేశాల మీద తన ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం.. ఇతర దేశాల్లో ఉన్న వనరులను కోళ్లగొట్టడం కోసం, తన ఆయుదాల వ్యాపారాన్ని మరింత విస్తరించడం కోసం వివిధ దేశాల మధ్య యుద్ధం సృష్టించి మానవ హననం చేస్తున్నాదని అన్నారు.. ప్రజల జీవించే హక్కున కాలరాస్తున్నదని తెలిపారు. అమెరికా తన సామ్రజ్యవాద విస్తరణ కాంక్షతో చేస్తున్న ఈ యుద్ధం వల్ల ప్రపంచం లోని అన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నాయని తెలిపారు. భారతదేశం లో ఉండే ప్రజల పై, సామాన్య మధ్య తరగతి ప్రజలపై పెను ఆర్ధిక భారం పడుతున్నదని అన్నారు..ఇతర దేశాల్లో ఉన్న భారతీయ పౌరులు కూడా అనేక సమస్యలతో, ప్రాణ భయం తో జీవించే పరిస్థితివచ్చిందని అన్నారు.అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ లో, లె బలాన్ లో వేలాది మంది అమాయక ప్రజలు మృత్యువాత పడ్డారని అన్నారు.. ఇరాన్ లో ఒక స్కూల్ పై జరిగిన దాడిలో ముక్కుపంచాలారని 150 మంది చిన్నారులు చనిపోయారని అన్నారు.. యుద్ధం వల్ల పర్యావరణం దెబ్బ తిని ప్రజలు అనారోగ్యం పాలై చనిపోతుంన్నారని.. జీవ వైవిద్యం దెబ్బ తిని వణ్య ప్రాణులు, పశు పక్షాదులు చనిపోతున్నాయని అన్నారు. అమెరికా యుద్ధ కాంక్ష ఒక దేశంతో ఆగిపోయేది కాదని భారత దేశం వరకు కూడా వచ్చే ప్రమాదం ఉందని అన్నారు.. అమెరికా యుద్ధ ఉన్మాదాన్ని, ఆదేశ అధ్యక్షులు ట్రంప్ పిచ్చి, మూర్ఖపు చర్యలను మానవతావాదులు, బుద్ధి జీవులు, భారత దేశ పౌరులు ఖండించాలని పిలుపునిచ్చారు

Leave A Reply

Your email address will not be published.