ఆర్టిజన్లను మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ముద్ర ప్రతినిధి,సిద్దిపేట :
తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం టీవీ ఏఈ జెఏసి ఆధ్వర్యంలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు తెలుపుతుందని సిఐటియు జిల్లా కార్యదర్శి కాముని గోపాలస్వామి అన్నారు సిద్దిపేటలోని విద్యుత్ డివిజన్ ఆఫీసు ముందు కార్మికులు చేపట్టిన ధర్నాకు మద్దతు తెలుపి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము ఆర్టిజన్ కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతుందని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ కార్మికుల సమస్యలు పరిష్కరింటం లేదని అన్నారు. కార్మికుల ప్రధాన డిమాండ్ ఆర్థిక డిమాండ్ కాదని ఒకే సంస్థలో రెండు రకాల సర్వీస్ రూల్స్ సరికాదని ఆర్టిజన్ కార్మికుల కోరుకుంటున్న కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశారు. సంస్థల పని చేస్తున్నటువంటి ఆర్టిజన్,ఔట్సోర్సింగ్, మీటర్ రీడర్స్, అన్ మ్యాన్ వర్కర్స్ కు జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్పాలని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసిన సందర్భంలో అధికారంలోకి వస్తే మీ అందర్నీ కన్వర్షన్ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోకపోవడం ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటని అన్నారు. కార్మికులు ప్రమాదాలకు గురై పిట్టలు లెక్క రాలిపోతుంటే యాజమాన్య సంస్థ వారి డిమాండ్లను పరిష్కరించకుండా వారి శ్రమను దోసుకుంటుందని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జేఏసీ నాయకులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు చేస్తున్న పోరాటాలకు, వారి సమ్మెకు సీఐటీయు ప్రత్యక్షంగా మద్దతిస్తుందని తెలిపారు. కార్మికులు ఐక్యంగా ఉండి తమ డిమాండ్లు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాళ్ళబండి శశిధర్, జేఏసీ డివిజన్ చైర్మన్ , చిట్కూరు సుధాకర్, నాయకులు గౌటి భాస్కర్, కనకరాజు, విష్ణువర్ధన్, నాగ బైరయ్య, శ్రీనివాస్, దేవరాజు,తదితరులు పాల్గొన్నారు