Take a fresh look at your lifestyle.

షార్ట్ పుట్ లో బ్రౌంజ్ మెడల్  సాధించిన విద్యార్థికి సన్మానం

  ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
హనుమకొండలో తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన షార్ట్ పుట్ అండర్ 20 లో జిల్లాలో శాంతి స్పొర్ట్స్ అసోసియేషన్ వారిచే నిర్వహిస్తున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరంలోని పి. మహేశ్వరి కి 3 ప్లేస్( బ్రౌంజ్ మెడల్ ) గెలుపొందింది. సోమవారం జిల్లా యువజన, క్రీడల అధికారి కే.ధనంజనేయులు తమ కార్యాలయంలో మహేశ్వరిని  ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహేశ్వరి రాబోయే రోజులలో మరిన్ని మేడల్స్ సాధించి యాదాద్రి భువనగిరి జిల్లా ను జాతీయ అంతర్జాతీయ స్థాయి లో నిలబెట్టాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మామిల కుమార్, దర్శనం జానకయ్యా, రాపక వెంకటేష్, కార్యాలయ సిబ్బంది మురళి, జయ, శ్రీనివాస్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.