Take a fresh look at your lifestyle.

తప్పిపోయిన బాలుడు తల్లిదండ్రుల చెంతకు

ముద్ర, శేరిలింగంపల్లి:
తప్పిపోయిన బాలుడిని క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు మియాపూర్ పోలీసులు. మియాపూర్ ఇన్ స్పెక్టర్ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం. మియాపూర్ న్యూ కాలనీకి చెందిన రాజేష్ కొడుకు సిద్ధార్థ్ (5) ఈరోజు ఉదయం ఇంటి బయట ఆడుకుంటూ ఒక కిలోమీటర్ దూరం వెళ్లి తప్పిపోయాడు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న మియాపూర్ పోలీసులు బాలుడిని గుర్తించి రెండు గంటల పాటు శ్రమించి తిరిగి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో బాలుడి ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు చేద్దామనుకున్న నేపథ్యంలో పోలీసులే ముందస్తుగా తమ బాబును గుర్తించి వారికి క్షేమంగా అప్పగించడం పై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.