Take a fresh look at your lifestyle.

శివలింగ వెటర్నరీ మెడికల్ స్టోర్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి పట్టణంలో వినాయక చౌరస్తా పి ఎస్ సి ఎస్ బ్యాంక్ ఎదురుగా ఏర్పాటుచేసిన శివలింగ వెటర్నరీ మెడికల్ స్టోర్ ని భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు స్వశక్తితో ఎదగాలని వారి అనుభవం ఉన్న ఫీల్డ్ ను ఎంచుకొని ఆర్థికంగా పరుపుష్టి చెందాలని అన్నారు. యాదాద్రి భువనగిరి ప్రాంతంలో పాడి పరిశ్రమ మీద ఎంతో మంది ఉపాధి పొందుతున్నారని వారికి నాణ్యమైన సరసమైన ధరలకు మెడిసిన్ అందించి రైతులకు సేవలందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేష్, కుంభం కీర్తి రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రేణుక బాబురావు, పట్టణ కౌన్సిలర్లు, మాజీ పిఎస్ఏస్ చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి, మండల నాయకులు, సర్పంచులు వెటర్నరీ డాక్టర్లు, గోపాలమిత్రులు రైతులు, ఎల్లముల జంగయ్య యాదవ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.