Take a fresh look at your lifestyle.

ఎన్ఎస్ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరం ముగింపు

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళాశాల జాతీయ సేవా పథకం విభాగం -1 ఆధ్వర్యంలో మండలంలోని తుక్కాపురం గ్రామంలో శీతాకాల ప్రత్యేక శిబిరంలో భాగంగా 7వ రోజు ముగింపు కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ గారు ఎం. శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామ సర్పంచ్ జనగాం పాండు మాట్లాడుతూ ఈ వారం రోజులు నిర్వహించిన ఈ శీతాకాల ప్రత్యేక శిబిరం మా గ్రామాన్ని ఎన్నుకోవడం చాలా సంతోషకరమని జాతీయ సేవా పథకం విభాగం -1 వాలంటీర్స్ ఊర్లో చేసిన పచ్చదనం పరిశుభ్రత ,చెట్ల తొలగింపు, మెడికల్ క్యాంపు, రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి చెట్లకు రంగులు వేయడం, ఊర్లో విద్య, ఆరోగ్య సర్వే లాంటి సేవలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ రాసాల లింగస్వామి యాదవ్, గ్రామపంచాయతీ సెక్రటరీ లోకేష్, ప్రోగ్రాం అధికారి తోటకూరి రామకృష్ణ, పాలక మండలి సభ్యులు రత్నపురం శ్రీకాంత్, జనగాం మహేష్, కృష్ణవేణి రమేష్, ఎలకొండ దేవేందర్, అలివేలు రాజశేఖర్ రెడ్డి, జాతీయ సేవా పథకం వాలంటీర్స్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.