ముద్ర కాప్రా:
రంజాన్ మాసం శాంతి, సహనం, సేవాభావానికి ప్రతీక అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని సైనిక్ పూరి లోని ఎమ్మెల్యే నివాసం లో ఉప్పల్ నియోజకవర్గంలో ముస్లిం సోదరుల కోసం బి ఎల్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లిం పెద్దలు, ఇమామ్‌లు, మోజంలకు బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాల ప్రజలు సఖ్యతతో, సౌభ్రాతృత్వంతో జీవించాలని ఆకాంక్షించారు. పేద , అర్హులైన కుటుంబాలకు సహాయం చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దేవేందర్ రెడ్డి ,ప్రభుదాస్ , మైనార్టీ సెల్ బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు బద్రుద్దిన్ , పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ జహంగీర్ రహీం, నవీన్ మాస శేఖర్ రహమాన్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముస్లిం పెద్దలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.