రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది -మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
ముద్ర, తాండూర్:
కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా
తాండూరు పట్టణంలోని ఎస్ వి ఆర్ గార్డెన్స్ లోప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక (99 రోజుల ప్రణాళిక లో) భాగంగా “రైతువారోత్సవాల” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో కలిసి పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ఈ సందర్భంగా సేంద్రీయ ఉత్పత్తుల మొబైల్ యాప్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఈ ప్రాంత రైతుల పట్ల, ప్రజల పట్ల, ఈ ప్రాంతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాడని, సీఎం రేవంత్ రెడ్డి కూడా తాండూర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఏది అడిగిన కాదనకుండా అమలు చేస్తాడని అంతటి పలుకుబడి మనోహర్ రెడ్డి కి ఉందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా
ఈ జిల్లాలో ఫాం ఆయిల్ తోటలు ఎక్కువగా పండించాలని, మీ ప్రాంతంలో ఫాం ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు.అధిక దిగుబడి కోసం ఫర్టిలైజర్ ఎక్కువ వాడవద్దని, మనందరం భూములను, పర్యావరణాన్ని, మన ఆరోగ్యాలను కాపాడుకోవాకంటే ప్రకృతి వ్యవసాయం చేయాలన్నారు.
ప్రాణహిత చేవెళ్ల, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను త్వరితగతిన నిర్మించి రైతుల పొలాలకు నీరుఅందిస్తామన్నారు.
ఆర్థిక ఇబ్బంది ఉన్నా రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు. రైతులు పండించిన పంటలకు ఇబ్బందులు కలగకుండా మొక్కజొన్నలు కొనుగోలు చేసి వరికి కూడా 500 బోనస్ ఇచ్చి రైతుల ఆదుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు అండగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే మనోహర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు సంతోషంగా వ్యవసాయం తీసుకుంటున్నారని తెలిపారు. తాండూర్ నియోజకవర్గం లోని కోటిపల్లి ప్రాజెక్ట్, జుంటుపల్లి ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో వలె శిలాఫలకాళ కె పరిమితం కాకుండా ప్రజల కళ్ళముందే అభివృద్ధి చేసి చూపిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సహాయ కార్యదర్శి సురేంద్రమోహన్, జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, డిసిసి అధ్యక్షులు ధారాసింగ్, మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ, వైస్ చైర్మన్ రజాక్, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నరసింహులు, పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ కౌన్సిలర్లు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.