Take a fresh look at your lifestyle.

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

  • ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి కల్వకుర్తి : నియోజకవర్గంలోని ఆసక్తి ఉన్న ప్రతి మహిళకు ఉపాధి కల్పించి కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు అందించేలా కృషి చేయడం జరుగుతుందని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన నిరుద్యోగ యువతులకు వివిధ కంపెనీలలో ఉద్యోగాలు పొందేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.రానున్న రోజుల్లో మరింత మంది మహిళలకు ఉపాధి కల్పించడం కోసం ప్రయత్నిస్తానని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తలకొండపల్లి మండలం వెల్జాల్,మదాయపల్లి,చౌదర్పల్లి,మెదక్ పల్లి,జంగారెడ్డి పల్లి, కల్వకుర్తి మండలం తాండ్ర,మార్చాలా, పంజూగుల, సిల్లార్ పల్లి వెల్దండ మండలం పెద్దపూర్, కర్కల్పహాడ్,ఆమనగల్, కడ్తల్ గ్రామాల నుండి మహిళలు హాజరయ్యారు. మొత్తంగా 60 మంది మహిళలకు ఇంటర్వ్యూల ప్రక్రియ పూర్తి చేసుకున్నారని, వీరిలో 14 మంది సత్వరమే ఉద్యోగంలో చేరగా,మిగతా 46 మంది వచ్చే వారం రోజులో ఉద్యోగాలలో చేరనున్నారు. ఇప్పటివరకు మొత్తం 200 మంది మహిళలు ఉద్యోగాల్లో చేరినట్లు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ కంపెనీ ప్రతినిధు లు ,ఐక్యత ఫౌండేషన్ సభ్యులు శేఖర్,రవి యాదవ్,శ్రీపతి,మహేష్,శ్రీను,కళ్యాణ్, జాన్సీ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.