Take a fresh look at your lifestyle.

ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి

 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు దొడ్డి కొమరయ్య అని చిన్నకోడూరు ఎస్సై చంద్రమోహన్, సిద్దిపేట కురుమ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పోతుగంటి రవికాంతులు అన్నారు. కురుమ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు కురుమ సంక్షేమ సంఘ భవనంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కొమురయ్య చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్ఫూర్తి ప్రదాత దొడ్డి కొమురయ్య.. ఆయనను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘ నేతలు శ్రీనివాస్, రాములు, రాజు, మల్లేశం,భోగేశ్వర, రమేష్,సతీష్, ప్రశాంత్,పరశురాములు, అజయ్,రాములు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.