Take a fresh look at your lifestyle.

మానవ సంబంధాల పరిరక్షణ కోసం ధార్మికకార్యక్రమాలను నిర్వహించాలి -మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్

 

ముద్ర మల్కాజిగిరి:

రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంజనేయ స్వామి ఆలయాన్ని పునఃనిర్మాణం చేసి, నూతనంగా నిర్మించిన గర్భగుడిలో శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీరామ పరివారం, శివుడు, నవగ్రహ విగ్రహాల పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కలియుగమని భావించే ఈ కాలంలో కూడా ధర్మాన్ని కాపాడే మహోన్నత బాధ్యతను భుజాన వేసుకుని ముందుకు సాగుతున్న నిర్వాహకులను అభినందించారు.
ప్రజలు తమకు ఉన్నా లేకపోయినా, ధర్మ పరిరక్షణ కోసం , మానవ సంబంధాల పరిరక్షణ కోసం ఇలాంటి ధార్మిక కార్యక్రమాలను నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా రాబోయే తరాలకు సాంస్కృతిక విలువలు, సంప్రదాయాలు, విశ్వాసాలను అందిస్తున్న బ్రాహ్మణులు , భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
“ధర్మం నిలిస్తే సమాజం నిలుస్తుంది — ఈ ధర్మ పరిరక్షణ యజ్ఞం నిరంతరం కొనసాగాలి” అని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో భానుక నర్మదా మల్లికార్జున్, దీపిక, పిట్టల నాగేష్ ముదిరాజ్, శేఖర్ యాదవ్ తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.