Take a fresh look at your lifestyle.

రైతు భరోసా విజయోత్సవ సంబరాలు

  • 9 రోజుల్లో 9 కోట్లు నగదు బదిలీ.

మల్యాల,ముద్ర విలేఖరి: రైతు భరోసా విజయోత్సవం సంబరాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని అంగడి బజార్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి, సీఎం రేవంత్ రెడ్డి, శాసనసభ్యులు మేడిపల్లి సత్యం చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుల ఖాతాల్లో 9 రోజుల్లో రూ.9 కోట్ల నగదు బదిలీ చేయడం అభినందనీయమని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా రైతు సంక్షేమం విషయంలో రాజీ పడకుండా పెట్టుబడి సాయం అందించారంటూ సీఎం రేవంత్‌, ఎమ్మెల్యే చొప్పదండి మేడిపల్లి సత్యం లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దొంగ ఆనందరెడ్డి, ముత్యం శంకర్ గౌడ్, బత్తిని మల్లేశ్వరిశ్రీనివాస్ గౌడ్, చందు, వెల్మ లక్ష్మారెడ్డి, దారం ఆదిరెడ్డి, మ్యాక లక్ష్మణ్, శనిగరపు తిరుపతి, నాగులపేట సంజీవ్, కొండ బత్తిని అనిల్, కటకం వినయ్, నక్క అనిల్, కంచర్ల లక్ష్మణాచారి, నేరెళ్ల సతీష్ రెడ్డి, బివి రమణ, శ్రీ కోటి శ్రీకాంత్, ఎండి. ఇమామ్, సంత ప్రకాష్ రెడ్డి, బాలే శ్రీనివాస్, మర్రి లక్ష్మణ్, వీరభత్తిని పృథ్వీరాజ్, కోరెపు వెంకటేష్, బండి రవి, కంటే అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.