ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా శనివారం మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి
6,7,18,19,28,29వ డివిజన్లలో పారిశుధ్య కార్యక్రమం చేపట్టారు.పరిసరాల పరిశుభ్రత కార్యాచరణ భాగంగా రోడ్లు ఊడ్చి చెత్త ఎత్తి ప్రజలకు పరిసరాల శుభ్రం గురించి వారు వివరించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం కూడా మంచి గా ఉంటుందని డివిజన్ ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామంజుల రెడ్డి ,కార్పొరేటర్లు, నస్రీన్ జహగీర్, అయిషా సిద్దిఖా ముజీబ్, శ్రీలత , రామస్వామి, మంజుల , మధు మోహన్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
