కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించాలి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్టా నాగేష్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరశిస్తూ మార్చి 1 నుండి 20 వ తేదీ వరకు సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు రూపొందించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ తెలిపారు.చిట్యాల మండల కేంద్రంలో స్థానిక కా, మేకల లింగయ్య స్మారక భవనంలో బుధవారం నాడు జరిగిన సిపిఎం మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.మండలంలోని వివిధ గ్రామాల లో నెలకొన్న సమస్యలపై సిపిఎం మండల బృందం అధ్యయనం చేసి ఆందోళన కార్యక్రమాలు రూపొందించనున్నట్లు తెలిపారు.అరూరి శ్రీను అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అవిశెట్టి శంకరయ్య,జిట్ట సరోజ, మండల నాయకులు బొబ్బిలి సుధాకర్ రెడ్డి, శీలా రాజయ్య, ఐతరాజు నర్సింహా,లడే రాములు, కల్లూరి కుమార స్వామి,కందగట్ల గణేష్, ఐతరాజు యాదయ్య, గుడిసె లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.