కోరుట్ల, ముద్ర విలేకరి: ఆషాడమాసం సందర్భాన్ని పురస్కరించుకొని కోరుట్ల కాలేజ్ గ్రౌండ్ దగ్గర ఉన్న శ్రీ దుర్గా దేవాలయం ఆధ్వర్యంలో శుక్రవారం బోనాల మహోత్సవ కార్యక్రమం ను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు పెద్ద పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పెండెం గణేష్, అయ్యప్ప దేవాలయ కార్యదర్శి జంబర్తి రమేష్, అమ్మవారి భక్తులు, ఆలయ నిర్వహాణ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గోన్నారు.
