- జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.
కోరుట్ల/కథలాపూర్, ముద్ర విలేకరి; ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరతగతిన నిర్మాణాలు చేపట్టేలా వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులకు సూచించారు. ఇప్పటికే ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించిన వారు నిర్దేశిత గడువులోపు, నాణ్యతతో నిర్మాణ పనులను పూర్తి చేసుకునేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం అందించే ఆర్ధిక తోడ్పాటు గురించి వివరిస్తూ అవగాహన కల్పించాలన్నారు. గ్రామంలో ఎన్ని కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయని అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు సత్వరమే ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. ఇండ్ల నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులను జిల్లా కలెక్టర్ పలుకరించి, ఇంటి నిర్మాణానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. వివిధ దశలను అనుసరిస్తూ వెంటదివెంట డబ్బులను ఖాతాలో జమ చేయిస్తామని అన్నారు. అలాగే గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులను, నేషనల్ హెల్త్ మిషన్, ఎన్ హెచ్ ఎం నిధులతో 20 లక్షల నాణ్యత ఏమైనా పరిమాణాలతో పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ వెంట కోరుట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి జివాకర్ రెడ్డి, హౌసింగ్ పిడి ప్రసాద్., కథలాపూర్ ఎమ్మార్వో, ఎంపీడీవో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
