Take a fresh look at your lifestyle.

పేద ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ లక్ష్యం..నంది మేడారంలో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి అడ్లూరి..

 అందరికీ అందుబాటులో సర్కారు వైద్యం..

 

ముద్ర న్యూస్, ధర్మారం:

పేద ప్రజలకు అవసరమైన వైద్యాన్ని అందించడం ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మారం మండలం నాకు రాజకీయంగా జన్మనిచ్చిందని.. 2006లో జెడ్పీటీసీ గా గెలిపించారని, నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ధర్మారం మండలానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తానని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలో 30పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్యానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి తెలిపారు. ధర్మారం మండలంలోని అన్ని గ్రామాలకు సౌకర్యంగా ఉంటుందని మేడారంలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేశామని మంత్రి తెలిపారు. మండల ప్రజలు మేడారంలోని ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని మంత్రి కోరారు. ఆస్పత్రిలో వైద్యుల కోరత, మందుల కోరత లేకుండా చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు.

ఆసుపత్రిలో పారిశుద్ధ్య పనుల కోసం ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేసి పరిశుభ్రంగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ తో పాటు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు క్రమం తప్పకుండా ఆసుపత్రిలో తనిఖీ చేసి ప్రజలకు అందుతున్న సేవలను గుర్తించాలని సూచించారు. ఆసుపత్రి నిర్మాణం కోసం స్థలం ఇచ్చిన దాతలను ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ అభినందించారు.

ఈకార్యక్రమంలో నంది మేడారం సర్పంచి వీర్ పాల్ , స్థలదాత నర్సింగరావు తో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

కార్యకర్తల గురించి కేటీఆర్ మాట్లాడడం విడ్డూరం..

పదేళ్లపాటు అధికారంలో ఉంది తెలంగాణ ఉద్యమకారులను కార్యకర్తలను పట్టించుకోని కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడంలేదని లో మాట్లాడడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత కేవలం కుటుంబంలోని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితలకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. మిగిలిన ఉద్యమకారులను, కార్యకర్తలను నాటి గుండీలు పాలనలో పట్టించుకోలేదని మంత్రి అన్నారు. అధికారంలో ఉన్న సమయంలో కార్యకర్తలను పట్టించుకోని కేటీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని చేస్తున్న ఆరోపణలు విడ్డూరంగా ఉన్నాయని మంత్రి అన్నారు.

తాను సామాన్య కార్యకర్తగా ఉంటూ నేడు క్యాబినెట్ మంత్రి వరకు వచ్చానని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి పక్కన ఒక కార్యకర్త కూర్చునే అవకాశం వచ్చిందని నాడు మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ ను కేసీఆర్ ఏనాడు తన పక్కన కూర్చోబెట్టుకోలేదని మంత్రి అడ్లూరి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అధిష్టానం కంటికి రెప్పలా కాపాడుకుంటుందని మంత్రి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.