- జయంతి కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా డీఆర్వో సంగీత.
ఉమ్మడి రంగారెడ్డి, ముద్ర ప్రతినిధి:సమాజం అభివృద్ధికి అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు మహాత్మ బసవేశ్వరుడు అని డిఅర్ఓ సంగీత అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహాత్మా బసవేశ్వర 892 జయంతి వెనుక బడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా డిఅర్ఓ సంగీత, బీసీ వెల్ఫేర్ అధికారి కేశవ్ రామ్, ఏవో సునిల్ కుమార్ కలిసి ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా డి అర్ ఓ సంగీత మాట్లాడుతూ మూఢనమ్మకాల పైన నిరంతరం పోరాటం చేసిన మహానుభావుడు బసవేశ్వరుడు అన్నారు.ప్ర ప్రథమ సంఘసంస్కర్త సమతవాది అని అన్నారు.అణగారిన వారి వర్గాల పట్ల ఆశావాది నిరంతర మార్గదర్శకుడని,బసవేశ్వరుని యొక్క మార్గాన్ని ముందుకు సాగాలని, సమాజ అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. జయతి కార్యక్రమంలో బి సి వెల్ఫేర్ అధికారులు, జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.