ముద్ర నడిగూడెం..
వేసవి కాలంలో తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాస్ అన్నారు. శనివారం నడిగూడెం మండల కేంద్రంలో వేసవికాలంలో తాగునీటి ఎద్దడి రాకుండా చేపడుతున్న చేతి పంపుల మరమ్మత్తు
పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మంచినీటి కొరకు ప్రజల ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలో అవసరమైన చోట ప్రత్యేక పైప్లైన్లు ఏర్పాటు చేసి మంచినీటి సరఫరా చేసేందుకు ప్రత్యేక నిధుల కేటాయించాలని సర్పంచ్ దున్నా శ్రీనివాస్ ఈ ఈ దృష్టికి తీసుకెళ్లారు.ఈ కార్యక్రమంలో ఏఈ ఇర్ఫాన్, పంచాయతీ కార్యదర్శి,
యలక ఉమారాణి,వార్డు సభ్యులు షేక్ నాజియా రియాజ్,మిషన్ భగీరథ సిబ్బంది వెంకన్న ,గ్రామపంచాయతీ సిబ్బంది నాగరాజు, సుభాని, గ్రామస్తులు పాల్గొన్నారు.