Take a fresh look at your lifestyle.

పన్ను ఎగవేత దారులపై కఠిన చర్యలు -పలు దుకాణాలను సీజ్ చేసిన మున్సిపల్ సిబ్బంది

ముద్ర, తాండూర్:

వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలో ఆస్తి పన్ను చెల్లించకుండా ఉన్న మొండి బకాయి దారుల పట్ల మున్సిపల్ సిబ్బంది కఠిన చర్యలు తీసుకున్నారు. పన్ను చెల్లించని వారికి రెడ్ నోటీసులు జారీ చేయడంతో పాటుగా తాళాలు వేసి కొన్ని షాపులను సీజ్ చేయడం జరిగింది.
గత కొన్ని సంవత్సరాలుగా మొండి బకాయిలు ఉన్నా బకా యిదారులపై సోమవారం ఉదయం శ్రీ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ టీం, బిల్ కలెక్టర్లు మరియు జవాన్లు మొండి బకాయి దారుల షాపులకు వెళ్లి తాళాలు వేయడం జరిగింది. పోట్లీ మహారాజ్ దేవాలయానికి సంబంధించి షాపులలో సీజ్ చేయడం జరిగింది.పలు దుకాణాలు ప్రైవేటు ప్రాపర్టీలకు సంబంధించి మొండి బకాయి దారులకు సైతం రెడ్ నోటీసులు అందిస్తూ పన్నులు సకాలంలో కట్టకపోతే చట్ట ప్రకారం చర్యలు గైకొనుబడుతాయని కమిషనర్ మధుసూదన్ రెడ్డి హెచ్చరించడం జరిగింది. టాక్సులు చెల్లించకపోతే మున్సిపాలిటీ గ్రాండ్లు నిలిచిపోయే అవకాశం ఉందని మున్సిపల్ కమిషనర్ వివరించారు. పట్టణ ప్రజలు టాక్స్ లు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరడం జరిగింది. కమిషనర్ వెంట మేనేజర్ నరేందర్ రెడ్డి, ఆర్ ఐ రాములు, బిల్ కలెక్టర్ నాగేందర్, కపిల్, వాడా ఆఫీసర్ గోపాల్, సానిటరీ ఇన్స్పెక్టర్ ఉమేష్,జవాన్లుతదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.