Take a fresh look at your lifestyle.

హజ్ యాత్రికులకు టీకాలు – 25న ప్రత్యేక వైద్య శిబిరం

 

 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ :

నాగర్ కర్నూల్: హజ్ యాత్రకు సిద్ధమవుతున్న యాత్రికుల కోసం ఈనెల 25న జిల్లా జనరల్ ఆసుపత్రిలో ప్రత్యేక టీకాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా హజ్ సొసైటీ అధ్యక్షుడు షేక్ ఫరీద్ అహ్మద్ తెలిపారు.

రాష్ట్ర హజ్ సొసైటీ మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో, యాత్రికులకు వైద్య పరీక్షలతో పాటు అవసరమైన టీకాలు అందించనున్నారు. ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలో ఈ టీకాల ప్రక్రియ జరుగుతుంది.

ఈ శిబిరంలో డాక్టర్ ఓరుగంటి శ్రీనివాసులు, డాక్టర్ సురేష్ బాబు సేవలు అందించగా, ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని డాక్టర్ రవికుమార్ నాయక్ పర్యవేక్షించనున్నారు. అలాగే డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహణ జరుగుతుంది.

అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, నాగర్ కర్నూల్ నియోజకవర్గాలకు చెందిన హజ్ యాత్రికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

తప్పనిసరిగా తీసుకురావాల్సిన పత్రాలు:

పాస్పోర్ట్ కాపీ

కవర్ నెంబర్ జిరాక్స్

ఆధార్ కార్డు జిరాక్స్

పాస్పోర్ట్ సైజ్ ఫోటో

పాత మెడికల్ రిపోర్టులు

సంప్రదించవలసిన నంబర్లు:

9154561788

9912873342

9052542716

హజ్ యాత్రికులు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

Leave A Reply

Your email address will not be published.