ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుల అక్రమ అరెస్టులకు నిరసనగాబిజెపి పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరామ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో బిజెపి నాయకులు శాంతియుత నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష నాయకుల స్వరాన్ని అణచివేయడానికి అక్రమ అరెస్టులు చేయడం దురదృష్టకరమని తెలిపారు. ప్రజల సమస్యలపై పోరాడుతున్న పార్టీ రాష్ట్ర నాయకులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్, రాష్ట్ర నాయకులు పడమటి జగన్ మోహన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శ్యామ్ సుందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా, మేడి కోటేష్, జనగాం నర్సింహ చారి, ఊదరి సతీష్, కొల్లోజు శ్రవణ్ కుమార్, కోళ్ల భిక్షపతి, కొలిచెలిమ మల్లిఖార్జున్, కారుపాటు రాజు, అందే విజయ్, తాడూరి బాలశంకర్, రాజకుమార్, మహమూద్, కోళ్ల సుధాకర్, పకీర్ రాజేందర్ రెడ్డి, కాలభైరవ, దయ్యాల కుమార్, కొదురుపాక కృష్ణ ఆనంద మోహన్, సుదర్శన్, సంతోష్, ఉషా కిరణ్, పెట్టబోయిన నాగరాజు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Prev Post